TG Budget-2024 : కాసేపట్లో బడ్జెట్ పద్దును గవర్నర్‌కు అందించనున్న డిప్యూటీ సీఎం భట్టి

by Sathputhe Rajesh |
TG Budget-2024 : కాసేపట్లో బడ్జెట్ పద్దును గవర్నర్‌కు అందించనున్న డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కాసేపట్లో 2024-2025 వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, బడ్జెట్ పద్దును గవర్నర్‌కు ఉప ముఖ్యమంత్రి అందించనున్నారు. బడ్జెట్ పద్దును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా, సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి అందించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ఫైనాన్స్ మినిస్టర్ భట్టి ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ.2.75 లక్షల కోట్లు కాగా.. పూర్తి స్థాయి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ దాదాపు రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిదులు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గ్యారంటీల అమలుకే రూ.50 వేల కోట్లకు పైగా దక్కే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed