- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Budget-2024 : అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో 2024-25 తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని భట్టి ప్రారంభించారు. గత పదేళ్లో అస్తవ్యస్త పాలన సాగిందన్నారు. రాష్ట్రం వచ్చాక అప్పు పది రెట్లు పెరిగిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం బడ్జెట్ ప్రతిని స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డిలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. కాగా, ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలలకు గులాబీ బాస్ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.