TG Budget-2024: అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ షురూ.. బడ్జెట్ వాల్యూ ఎంతో తెలుసా?

by Shiva |   ( Updated:2024-07-25 05:06:29.0  )
TG Budget-2024: అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ షురూ.. బడ్జెట్ వాల్యూ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యహ్నం 12 గంటలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అయితే, ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. బుధవారం సభలో ఇదే అంశంపై చర్చించి కేంద్రం రీబడ్జెట్ ప్రవేశపెట్టాలంటూ సభలో తీర్మాణం చేశారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేయబోతోంది. అయితే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ రూ.2.97 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో ప్రధాన్యతను కల్పించే అవకాశం ఉంది.

Advertisement

Next Story