TG Budget 2024-25: డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు సర్కార్ ఫోకస్.. పోలీసు శాఖకు రూ.9,564 కోట్ల కేటాయింపు

by Shiva |
TG Budget 2024-25: డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు సర్కార్ ఫోకస్.. పోలీసు శాఖకు రూ.9,564 కోట్ల కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి చేసేందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు బడ్జెట్‌లో హోంశాఖకు ప్రభుత్వం రూ.9,564 కోట్లు కేటాయించింది. డ్రగ్స్ అమ్ముతూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. తీసుకున్నా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ ఇప్పటికే క్లియర్‌గా పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చామని సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, నార్కోటిక్ బ్యూరో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, పబ్బులు, క్లబ్‌లు, గౌడౌన్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి.. 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌గా నియమించామని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల జరిగే హానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ నటుల సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. డ్రగ్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని డగ్స్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

Next Story