TG Budget 2024-25: రైతాంగానికి భారీ గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు

by Shiva |   ( Updated:2024-07-25 07:08:01.0  )
TG Budget 2024-25: రైతాంగానికి భారీ గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. మొత్తం రూ.72,659 కోట్లను రైతాంగానికి కేటాయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఆ నిధులను వినియోగించనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Advertisement

Next Story