వేలంలో భారీ ధర పలికిన TG 09 A 9999 నెంబర్

by Mahesh |   ( Updated:2024-07-24 14:43:21.0  )
వేలంలో భారీ ధర పలికిన TG 09 A 9999 నెంబర్
X

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో వాహనాల కంటే ఎక్కువ ధరను కారు నెంబర్లకు కేటాయించే వ్యక్తులు ఎక్కువయ్యారు. సెంటిమెంట్ కోసం కొందరు, స్టైల్ కోస మరికొందరు, తమ హోదాను చూపించుకోవడానికి మరికొందరు.. ఫ్యాన్సీ నెంబర్లను కోరుకుంటున్నారు. దీంతో ఈ ఫ్యాన్సీ నెంబర్లు ప్రభుత్వానికి సిరులు కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్లకు వేలం వేయగా రూ. 51,17,514 ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇందులో అత్యధికంగా.. TG 09 A 9999 అనే నెంబర్ ను హానర్ డెవలపర్స్ పీప్ట్ లిమిటెడ్ రూ. 19,51,111 కొనుగోలు చేసింది. అలాగే TG 09 B 0001 నెంబర్ ను N G మైండ్ ఫ్రేమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ. 8,25,000 వేలంలో దక్కించుకుంది. వీటితో పాటుగా.. TG 09 B 0009 నెంబర్ రూ. 6,66,666 లకు, TG 09 B 0006 నెంబర్ ను రూ. 2,91,166 లకు, TG 09 B 0005 నెంబర్ ను రూ. 2,50,149 లకు, TG 09 B 0019 నెంబర్ ను రూ. 1,30,000 లకు వేలంలో దక్కించుకున్నారు.

Advertisement

Next Story