BJP రెండో జాబితాలో మందకృష్ణతో పాటు వీరికే ఛాన్స్?

by GSrikanth |
BJP రెండో జాబితాలో మందకృష్ణతో పాటు వీరికే ఛాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రకటించిన తొలి పార్లమెంట్ అభ్యర్థుల జాబితా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఒకరిద్దరు మినహా మిగిలిన అభ్యర్థులంతా ఊహించిన వారే కావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి కోసం మురళిధర్ రావు, మల్క కొమురయ్యలు పోటీ పడినా అధిష్టానం ఈటల వైపే మొగ్గుచూపింది. దీంతో మురళిధర్ రావు, కొమురయ్య అనుచరులు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన బీబీ పాటిల్‌లో పాటు నాగర్ కర్నూలు అభ్యర్థి భరత్ కూడా టికెట్ పొందడం ఆ పార్టీలో దుమారం రేపింది.

ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారిని కాదని నిన్న,మొన్న చేరిన వారికి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితా కంటే ఎక్కువ పోటీ రెండో జాబితాపైనే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాలు మినహా మిలిగిన నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు వరంగల్ బరిలో ఉంటాడనున్న మందకృష్ణ పెద్దపల్లికి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండలో సమర్ధుల కోసం గాలిస్తున్నారు.

1. మంద కృష్ణ = పెద్దపల్లి

2. కృష్ణ ప్రసాద్ = వరంగల్

3. రమేశ్ రాథోడ్/సోయం బాపూరావు = ఆదిలాబాద్

4. డీకే అరుణ/జితేందర్ రెడ్డి = మహబూబ్ నగర్

5. రఘునందన్ రావు/అంజిరెడ్డి = మెదక్

Advertisement

Next Story