- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత.. కన్వాయ్‌కి అడ్డుపడ్డ ఏబీవీపీ నాయకులు (వీడియో)
దిశ, కరీంనగర్ టౌన్: మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌కు ఏబీవీపీ నాయకులు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాన్వయని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంగళవారం కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ వస్తున్న క్రమంలో ఏవిపి కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లారు. పోలీసులు వెంటనే రంగంలో దిగి ఏబీవీపీ కార్యకర్తలను నిలువరించారు.
అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని, హాస్టల్స్, గురుకులాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ నిధులు విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి: Breaking : KTR పర్యటన ఎఫెక్ట్ : జర్నలిస్టులకు ఏసీపీ సీరియస్ వార్నింగ్
మీరా మాకు నీతులు చెప్పేది..? సీఎం KCRపై Kishan Reddy విమర్శలు