TSPSC కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్! భారీగా పోలీసుల మోహరింపు

by Sathputhe Rajesh |
TSPSC కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్! భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, కార్వాన్ : హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నిన్న బీజేవైఎం, యూత్ కాంగ్రెస్ నాయకులు టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించి కార్యాలయ ప్రధాన బోర్డును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం వారిపై బేగం బజార్ పోలీసులు ఆందోళన కారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగులను ఐడి కార్డులు చెక్ చేసి లోనికి పంపిస్తున్నారు. పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కొద్దిసేపట్లో ఓయూ జేఏసీ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed