Breaking: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసు బలగాలు

by Ramesh N |   ( Updated:2024-07-15 14:28:32.0  )
Breaking: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసు బలగాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు సాయంత్రం నుంచే గ్రంథాలయానికి భారీగా గ్రూప్స్, డీఎస్సీ పరీక్ష అభ్యర్థులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గ్రూప్ 2, 3, డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పటికే భారీగా పోలీసులు బలగాలు లైబ్రరీ వద్దకు చేరుకున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు నిరుద్యోగుల ప్రయత్నం.. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు.

నిరుద్యోగులతో పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లైబ్రరీ వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. కాగా, ఇవాళ ఉదయం విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు కలిసి సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ, గ్రూప్స్ 2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed