‘‘ఆ 4 రోజులు అవసరమైతేనే బయటకు రండి’’.. ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్!

by Satheesh |   ( Updated:2023-05-16 10:02:25.0  )
‘‘ఆ 4 రోజులు అవసరమైతేనే బయటకు రండి’’.. ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. భానుడి సెగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వడదెబ్బ తగిలి జనాలు పిట్టల్లా రాలుతున్న పరిస్థితి నెలకొంది.

ఉదయం 9 గంటలకు మొదలవుతున్న భానుడి ప్రతాపం సాయంత్రం 6 గంటలు దాటినా తగ్గడం లేదు. తెలంగాణలోని 11 జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. మరోవైపు ఏపీలో 46 డిగ్రీలు క్రాస్ అయింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని, వేసవి తాపం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed