- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా గడ్డపై తెలుగు హవా.. అమాంతం పెరిగిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారా? సొంత వారికి సొంత భాషకు దూరంగా ఎలా గడపాలో అనే చింతిస్తున్నారా? ఇకపై ఆ సమస్యే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఎటు చూసినా తెలుగు వారే కనిపిస్తున్నారు. అమెరికా గడ్డపై తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గడిచిన 8 ఏళ్లలో నాలుగు రేట్లు ఈ సంఖ్య పెరిగినట్లు తాజాగా యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా వెల్లడించింది. అక్కడ తెలుగు మాట్లాడే వారి జనాభా 2016లో 3.2 లక్షలు ఉంటే 2024 నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా దాదాపు 2 లక్షల మంది తెలుగు మాట్లాడే జనాభా ఉండగా ఆ తర్వాత టెక్సాస్ లో 1.5 లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్షలు, ఇల్లినాయిస్ లో 83,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 మంది తెలుగు వారు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. అయితే యూఎస్ లో 350 భాషలు ఉండగా అత్యధిక మంది మాట్లాడే భాషలో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ పెరిగే వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారిలో ఇప్పటికే అక్కడ అనేక మంది స్థిరపడిపోగా వారి పిల్లలు, మనవళ్లు మొదలుకుంటే చదువులు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి.