- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్ సభలో తెలుగు ఎంపీల ప్రమాణస్వీకారం.. తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి
దిశ, డైనమిక్ బ్యూరో: 18వ లోక్‌సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు అందించారు. ముందుగా ప్రధాని మోడీ చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అనే నేను.. అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు ఏపీ ఎంపీ పెమ్మసాని చంద్ర చంద్రశేఖర్, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు సైతం తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ లీడర్, అరకు ఎంపీ తనుజా రాణి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కొంత మంది తెలుగు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే, తొలి రోజు మొత్తం 280 మంది చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి.