మీ ఫామ్‌హౌస్‌ సంగతి చెప్పు సారూ..? ఎన్ని ఎకరాలు ఎండిందో చూపియాలే! నెటిజన్ల పశ్న

by Ramesh N |
మీ ఫామ్‌హౌస్‌ సంగతి చెప్పు సారూ..? ఎన్ని ఎకరాలు ఎండిందో చూపియాలే! నెటిజన్ల పశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండిన పంటలు పరిశీలించడానికి రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండిన పంటలను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. రైతలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు కేసీఆర్ భరోసానిచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘మీ ఫామ్ హౌస్‌లతో ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో చూపెట్టండి సార్? ఆ తర్వాత బయటకు వచ్చి తిరిగితే బాగుంటది. మళ్ళీ ఆ పిట్టలదొర టోపీ ఒకటి’ అని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కాగా, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌ వద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ అప్పుడప్పుడు తన పొలం పనులు కూడా చూసుకుంటారు.

Advertisement

Next Story