KTR : శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఎన్నటికి మరువదు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఎన్నటికి మరువదు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)ఉద్యమంలో శ్రీకాంతాచారి(Srikanthachari) అమరత్వం గొప్పదని.. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)శ్లాఘించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఎక్స్ వేదికగా కేటీఆర్ జోహార్లు అర్పిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండను, కేసీఆర్ అరెస్ట్ ను చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యాడన్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానమైన శ్రీకాంత్ చారికి తెలంగాణ సమాజం జోహార్లు అర్పిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed