Sankranti Holidays :తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు

by Y. Venkata Narasimha Reddy |
Sankranti Holidays :తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంక్రాంతి(Sankranti Holidays)సెలవులపై ప్రభుత్వం(State Government) అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు వారం రోజులు సెలవులు ప్రకటించింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.

సెలవులపై క్లారిటీ రావడంతో తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడపేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఏపీలో సంక్రాంతి సెలవులపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. జనవరి 10 నుంచి 19 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed