- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TET Notification: బ్రేకింగ్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (Telangana TET Notification) విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (TET) ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ పరీక్షలకు రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరిలో పరీక్షలు నిర్వహించనుండగా.. లక్షలాది మంది ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి.
ఈ ఏడాది నిర్వహించిన టెట్ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరవ్వగా.. 1.09 లక్షల మంది పాసయ్యారు. కాగా.. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షలు రాయనున్నారు. టెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 9 సార్లు పరీక్షలు నిర్వహించగా.. వచ్చే ఏడాది జనవరిలో 10వ సారి టెట్ పరీక్షలు జరుగనున్నాయి.