Aquatic Championship : తెలంగాణ స్విమ్మర్ తేజస్‌కు కాంస్యం.. సీఎం అభినందనలు

by Ramesh N |
Aquatic Championship : తెలంగాణ స్విమ్మర్ తేజస్‌కు కాంస్యం.. సీఎం అభినందనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ తేజస్‌ కాంస్యం పతకం సాధించాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న 40వ సబ్‌ జూనియర్‌, 50వ జూనియర్‌ జాతీయ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ కుమార్‌ టీఎస్‌ తేజస్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మంగళవారం జరిగిన 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్విమ్మర్ తేజస్ 59:78 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.

తేజస్‌ కాంస్య పతకం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంస్య పతకం గెలుచుకున్న మన తెలంగాణ బిడ్డ తేజస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాభినందనలు. నీ అద్భుత ప్రదర్శన తెలంగాణకు గర్వకారణం. భవిష్యత్‌లో కూడా ఇలాగే రాణించి, మరిన్ని విజయాలను సాధించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story