బీ కేర్‌ఫుల్.. మదర్స్ డే ఆఫర్ లింక్ పై క్లిక్ చేస్తున్నారా..?

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-19 09:55:05.0  )
బీ కేర్‌ఫుల్.. మదర్స్ డే ఆఫర్ లింక్ పై క్లిక్ చేస్తున్నారా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకు సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. కొత్త కొత్త ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్న ఓ మెసేజ్ పై తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఈ నేరాలపై హెచ్చరిస్తూ 'దయచేసి అందరూ దృష్టి సారించండి. అమెజాన్ 2022 మదర్స్ డే కాంటెస్ట్' అంటూ ఓ ఫేక్ లింక్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది. దయచేసి ఎవరూ దానిని ఓపెన్ చేయవద్దు' అంటూ ట్వీట్ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Next Story