ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ .. తుది ఫలితాల విడుదల అప్పుడే?

by samatah |
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ .. తుది ఫలితాల విడుదల అప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. పోలీసు ఉద్యోగాల తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించడానికి పోలీస్ నియామక మండలి కసరత్తు చేస్తుంది.గత నెల 12న ప్రారంభమైన తుది రాతపరీక్షలు ఈ నెల 30 నాటికి ముగియనున్న సంగతి తెలిసిందే.దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్‌ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశమిస్తారు. ఇక ఇప్పటికే పూర్తైన పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story