మేడారం భక్తులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక విజ్ఞప్తి

by GSrikanth |
మేడారం భక్తులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో జాతరగా మేడారం గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ జాతర హడావుడి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా ఈ జాతరకు ఏర్పాట్లు చేసింది. తాజాగా.. జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

అయితే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అడవుల్లో వేయవద్దని, పరిశుభ్రత పాటించాలని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టలో బీజేపీ ప్రభుత్వం దేశప్రజలను భాగస్వాములను చేసినట్లు.. తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం జాతరలో రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తోంది. మరోవైపు వనదేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ఈనెల 21 నుంచి జరగనున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి తల్లులను దర్శించుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed