Telangana Police : కొత్త తరహా మోసం.. అందమైన అమ్మాయి కవ్విస్తుంది. పబ్స్‌కి వెళ్తే జాగ్రత్త!

by Ramesh N |
Telangana Police : కొత్త తరహా మోసం.. అందమైన అమ్మాయి కవ్విస్తుంది. పబ్స్‌కి వెళ్తే జాగ్రత్త!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చాలా మంది అబ్బాయిలు.. కొత్తగా పరిచయం అయిన కొంత మంది అమ్మాయిల మోజులో పడి జేబు ఖాళీ చేసుకుంటున్నారు. చివరకు మోసపోయామని గ్రహించి కంగుతింటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ (Telangana Police) అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. కొత్త తరహా మోసం.. హోటల్స్, (Pubs) పబ్ అంటూ వెళ్ళగానే అందమైన అమ్మాయి తారసపడుతుంది. కవ్విస్తుంది.. మురిపిస్తుంది.. మైమరిపిస్తుంది. మిమ్మల్ని ఆశల పల్లకిలో ఉంచి మీ హోటల్ లేదా పబ్ బిల్ అమాంతం పెరిగేలా చేస్తుంది.

ఆ డబ్బును పబ్‌కి కట్టేలా ఒత్తిడి చేసి మిమ్మల్ని మోసం చేస్తుంది. పబ్స్‌కి వెళ్ళినప్పుడు తస్మాత్ జాగ్రత్త.. అంటూ అబ్బాయిల అవగాహన కోసం ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది అబ్బాయిలు మోసపోయి.. రూ. 20 వేల నుంచి 60 వేలకు పైగా బిల్ చేయించి జేబులు ఖాళీ చేయించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Next Story