- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: పోలీస్ ఈవెంట్స్‌కు వెళ్తున్నారా.. ఇవి మర్చిపోకండి!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలు(ఫిజికల్ టెస్ట్స్) గురువారం (08-12-2022) ప్రారంభమయ్యాయి. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జనవరి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్‌పుట్‌లు ఉంటాయి. 1600 మీటర్ల రన్నింగ్‌కు వంద మార్కులు ఉండగా.. లాంగ్ జంప్, షార్ట్‌పుట్‌లు కేవలం అర్హత కోసం మాత్రమే. వీటికి ఎలాంటి మార్క్స్ ఉండవు, కానీ, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, పార్ట్-2 దరఖాస్తు, కమ్యూనిటీ సర్టిఫికెట్, తప్పనిసరి తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుల్లో పేర్కొన్న సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాలి. గ్రౌండ్‌లో అభ్యర్థులు వెంట తీసుకెళ్లే సమాన్లు భద్రపరుచుకోవడానికి రూములు ఉండవు. కావున చేతికి గొలుసులు, రింగులు ధరించకుండా ఉండాలి. మెహందీ, టాటూలు వేసుకోకూడదని అధికారులు సూచించారు. అంతేగాకుండా.. మైదానంలోకి సెల్‌ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ముందుగా 1600 మీటర్ల పరుగు పందెం, ఆ తర్వాత ఎత్తు కొలత, ఆ తర్వాత లాంగ్‌జంప్, ఆ తర్వాత షార్ట్‌పుట్‌లు ఉండనున్నాయి.