VIRAL VIDEO: తెలంగాణ పోలీస్ బోల్తే! కటౌట్ చూసి.. రూల్స్ ఫాలో అయ్యారంట!

by Ramesh N |
VIRAL VIDEO: తెలంగాణ పోలీస్ బోల్తే!  కటౌట్ చూసి.. రూల్స్ ఫాలో అయ్యారంట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలు, నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైవేలపై జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హైవేల వద్ద పోలీస్, పోలీస్ వాహనం ఫోటోలు సర్కిల్ల వద్ద కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అచ్చం విధులు నిర్వహిస్తున్నట్లు కన్పిస్తున్న పోలీస్ ఫోటో.. వెహికిల్ హైవే సర్కిల్ వద్ద పార్కింగ్ చేసినట్లుగా కటౌట్‌లు ఏర్పాటు చేసిన దృశ్యాలు వీడియోలో కన్పిస్తుంది. ఇది చూసిన వాహనాదారులు హెల్మెట్ ధరించి వాహనం డ్రైవ్ చేయడం, స్పీడ్ తగ్గించి నార్మల్‌గా వెల్లడం వంటి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు పోలీసుల వినూత్న ఐడియాను మెచ్చుకుంటున్నారు. ఇది కరీంనగర్ టు వేములవాడ హైవేపై ఏర్పాటు చేశారని, నిజం పోలీస్ అనుకున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ బోల్తే బాయ్ అంటూ ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశారు. ‘మోసగాళ్లకు మోసగాడు అని వినుడే కానీ చూసుడు ఇదే ఫస్ట్ టైం మామాస్’ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. చేలల్లో దిష్టి బొమ్మ కాన్సెప్ట్ ఇన్స్పిరేషన్ అని మరో నెటిజన్లు సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed