రాగి ఆకుపై తెలంగాణ నూతన సెక్రటేరియట్

by sudharani |
రాగి ఆకుపై తెలంగాణ నూతన సెక్రటేరియట్
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన ఈ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 30న కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఈ సచివాలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.

కాగా, ఈ నూతన పరిపాలనా కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మకళాకండాల నిపుణుడు ప్రదీప్.. రాగి ఆకుపై ఎంతో కళాత్మకంగా చిత్రీకరించారు. సచివాలయం రాజసం ఉట్టిపడేలా రాగి ఆకుపై పొందుపరిచారు. సెక్రటేరియట్ పైనా TS అని ఇంగ్లిష్ అక్షరాలను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటుంది. అయితే రాగి ఆకుపై పొందిపరిచిన సెక్రటేరియట్ చిత్రాన్ని సచివాలయంలో ప్రదర్శనకు ఉంచాలని ప్రదీప్ కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed