బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలతో ఉత్తర కొరియాకు మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |
బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలతో ఉత్తర కొరియాకు మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవం కోసం దక్షిణ కొరియాలోని సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఈ నెల 21 నుంచి 24 వరకు సియోల్‌ లో పర్యటించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపనుంది. ఈ బృందంలో ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు సభ్యులు ఉన్నారు. కాగా, ఇప్పటికే సియోల్ లోని హాన్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసిన విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లండన్ లోని థేన్స్ డెవలప్మెంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు.




నేడు చెక్కుల పంపిణీ

మూసీ పునరావాస కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు హాజరవుతారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed