- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: ఎన్నికలు వాయిదా.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ నెల 28న జరగాల్సి ఉన్నది. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ 13 కార్మిక సంఘాలు, యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించాయి. దాదాపు ఆరు జిల్లాల పరిధిలోని 43 వేల మంది కార్మికులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు 700 మంది ఎలక్షన్ డ్యూటీలో ఉంటాల్సి ఉంటుందని సింగరేణి యాజమాన్యం పేర్కొన్నది.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది ఆ డ్యూటీల్లో బిజీగా ఉన్నందున సింగరేణి ఎన్నికలను నిర్వహించడం ఇబ్బందికరమేనని హైకోర్టుకు తెలిపింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వలోని ధర్మాసనం డిసెంబరు 27న పోలింగ్ నిర్వహించాలని, ఇందుకోసం నవంబరు 30న ఓటర్ల జాబితాను రెడీ చేయాలని స్పష్టం చేసింది.
డిప్యూటీ లేబర్ కమిషనర్ గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఎన్నికల తేదీని అక్టోబరు 28గా ఫిక్స్ చేశారు. కానీ కార్మిక సంఘాలు, యాజమాన్యం ఇందుకు సిద్ధంగా లేకపోవడంతో అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి బెంచ్ దీన్ని విచారించి ఎన్నికలు జరపాల్సిందేనని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ సింగరేణి యాజమాన్యం డివిజన్ బెంచ్‌ను అప్రోచ్ అయింది.
కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, గతంలో పిటిషన్ వేసిన ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, రీజినల్ లేబర్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీచేసి అక్టోబరు 11 వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ ప్రకారం బుధవారం దీన్ని విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. నవంబరు 30న ఓటర్ల జాబితాను రెడీ చేసుకుని డిసెంబరు 27న ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.