బిగ్ బ్రేకింగ్.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

by Javid Pasha |   ( Updated:2023-05-31 05:44:35.0  )
బిగ్ బ్రేకింగ్.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని ఎంపీ అవినాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బుధవారం కేసు విచారణ చేపట్టిన కోర్టు.. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

రూ. రూ. 5 లక్షలతో పూచీకత్తు సమర్పించాలని, సీబీఐకి చెప్పకుండా దేశం విడిచి వెళ్లవద్దని, అలాగే ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు తెలిపింది. ఇక సీబీఐ విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, సీబీఐ అధికారులకు సహకరించాలని అవినాష్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి తెలిపింది. కాగా కేసు విచారణలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story