పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ వాయిదా

by Prasad Jukanti |
పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారని దీని అందువల్ల వీరిపై అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనర్హత ఫిర్యాదులపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story