Shabbir Ali: ఒలింపిక్ స్థాయి శిక్షణ అందిస్తాం: స్టేడియం శంకుస్థాపనలో షబ్బీర్ అలీ

by karthikeya |
Shabbir Ali: ఒలింపిక్ స్థాయి శిక్షణ అందిస్తాం: స్టేడియం శంకుస్థాపనలో షబ్బీర్ అలీ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడాకారులకు ఒలింపిక్ స్థాయి శిక్షణ (Olympic Range Training) అందిస్తామని, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Telangana Govt Advisor Shabbir Ali) అన్నారు. గురువారం (Thursday) నాడు నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 8 ట్రాక్‌ల స్టేడియం (8 Track Stadium)తో పాటు ఇండోర్ స్టేడియాన్ని (Indore Stadium) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత నిజామాబాద్‌కు ఉందని అన్నారు. అరకొర సదుపాయాలతోనే జిల్లా క్రీడాకారులు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారని, అలాంటి వారికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో శిక్షణ (World Class Training) అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ గత ప్రభుత్వం క్రీడాకారులను పట్టించుకోలేదని, ఏకంగా ఈ మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని ఆయన ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం క్రీడాకారుల గురించి ఆలోచించి అన్ని సదుపాయాలతో క్రీడా అకాడమీ (Sports Academy)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే హకీంపేటలో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు షబ్బీర్‌ అలీ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed