- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ కల సాకారం.. వంటేరు ప్రతాప్ రెడ్డి
దిశ, గజ్వేల్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోరాటంతోనే తెలంగాణ కల సాకారమైందని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ బాద్యులు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు కేసీఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో తపించారని, దేశంలో ఉండే నాయకులందరినీ ఒకే తాటి పై తెచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దీక్షా దివస్ లాంటి దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారన్నారు.
ఆ రోజు కరీంనగర్ నుండి దీక్షా దివస్ కు బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్వేగ భరిత నినాదంతో బయలుదేరి చావునోట్లో తలపెట్టి, తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిన మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు స్వాతంత్ర్యం సాధించడానికి గాంధీజీ భారతదేశాన్ని ఒక్క తాటిపైకి తెస్తే.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బానిస సంకెళ్ళకు బందీ అయిన తెలంగాణ దాస్య శృంకలాలు తెంచడానికి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర ఉంటుందని ఉద్వేగంగా చెప్పడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారన్నారు. కేసీఆర్ ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను కదిలించిందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. 29న సిద్దిపేటలో జరగబోయే దీక్షా దివస్ లో ప్రతి ఒక్క తెలంగాణ వాది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు ప్రజలు, పెద్ద ఎత్తున 9 గంటల 30 నిమిషాలకు సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, అక్కడి నుండి సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు పెద్ద ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఎంపీపీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, వైస్ చైర్మన్ జకీయొద్దిన్, జెడ్పీటీసీలు మంగమ్మ రామచంద్రం, పంగ మల్లేశం, జయమ్మ అర్జున్ గౌడ్, ఎంపీపీ పాండు గౌడ్, పీఎస్ఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బండే మధు, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నూనె కుమార్ యాదవ్, పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ వింగ్ నాయకులు జుబేర్ భాష, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి దయాకర్ రెడ్డి, నరేష్ గుప్తా చంద్రశేఖర్ గుప్తా, గణేష్ గుప్తా, నాయకులు గాలెంక నర్సింలు, అహ్మద్, పాల రమేష్ గౌడ్, స్వామి చారి, తుమ్మ గణేష్, తదితరులున్నారు.