Hemant Soren: జార్ఖండ్ ప్రజలను ఎవరూ విడదీయలేదు.. బీజేపీపై హేమంత్ సోరెన్ విమర్శలు

by Shamantha N |
Hemant Soren: జార్ఖండ్ ప్రజలను ఎవరూ విడదీయలేదు.. బీజేపీపై హేమంత్ సోరెన్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ (Jharkhand) ముఖ్యమంత్రి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) బీజేపీపై(BJP) విమర్శలు గుప్పించారు. జార్ఖండ్‌ ప్రజలను ఎవరూ విడగొట్టలేరని చెప్పుకొచ్చారు. ‘‘ఐకమత్యమే మనందరి ఆయుధం. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మనల్ని ఎవరూ విభజించలేరు. తప్పుదోవ పట్టించలేరు. మన గొంతు నొక్కాలని వారెంతో (బీజేపీని ఉద్దేశిస్తూ) ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నానికి రెట్టింపుగా తిరగబడ్డాం. వారికి వ్యతిరేకంగా గళమెత్తాం. ఎందుకంటే మనమంతా జార్ఖండ్‌ గడ్డ బిడ్డలం. ఎవరికీ తలవంచం’’ అని హేమంత్‌ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలుపు

కాగా.. జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 81 స్థానాలుండగా.. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్‌ జనశక్తిపార్టీ (రాం విలాస్‌), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి.

Advertisement

Next Story