- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
దిశ, చిగురుమామిడి : మహాత్మా జ్యోతిబాపూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గురువారం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని జ్యోతిబా పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబాపూలే నవభారత నిర్మాణానికి, కుల నిర్మూలన కోసం రాజీ లేని పోరాటం చేశారని తెలిపారు.
సామాజిక అసమానతల కోసం ఉద్యమం చేశారని తెలిపారు. సమాజంలో అందరూ చదువు కోవాలనే ఆలోచన ఉన్న గొప్ప వ్యక్తి పూలే అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నదే పూలే విధానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీఓ బాసం మధుసూదన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.