- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా వైసీపీ ఎంపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఏపీకి కాంగ్రెస్ విలన్ గా మారిందని అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో వైసీపీ తరపున పాల్గొన్న విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ధ్వజమెత్తారు. 2029 లో కూడా నేను ఎంపీగా ఉంటాను. అప్పుడు కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా ఉండరన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అవుతుందన్నారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటు అని మండిపడ్డారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని ఈ విషయాన్ని చరిత్ర మరువదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కంటితుడుపు హామీ ఇచ్చింది. ఏపీ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.