కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం

by Prasad Jukanti |
కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకతీయ యూనివర్సిటీ వీసీ టి.రమేష్ పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కాకతీయ యూనివర్సిటీ నిధుల దుర్వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధ్యాపకుల తొలగింపు, అక్రమ బదిలీలు, పీహెచ్ డీ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలు వంటి ఆరోపణలు రమేష్ ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. రమేష్ అక్రమాలపై యూనివర్సిటీ విద్యార్థులు చాలా కాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రమేష్ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed