- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెంకయ్య నాయుడు, చిరంజీవికి తెలంగాణ సర్కార్ సత్కారం
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి, పద్మ విభూషన్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు చెప్పి సన్మానం చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 4వ తేదీన పద్మ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుందని దానికి తప్పక హాజరు కావాలని వెంకయ్యను మంత్రి ఆహ్వానించారు. అంతేకాదు.. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవినీ జూపల్లి కలిశారు. అనంతరం శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సత్కరించారు. సత్కార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
కాగా, పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్‌లాల్, శిల్పకారుడు స్తపతి ఆనందాచారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఉన్నారు.