Breaking: ఫ్రీ బస్సు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-04-08 11:43:58.0  )
Breaking: ఫ్రీ బస్సు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలు రూపాయి కూడా కట్టకుండా బస్సు జర్నీ చేయొచ్చని ప్రకటించింది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సులో భారీగా ప్రయాణించడం మొదలు పెట్టారు. సీట్ల కోసం కొన్ని సందర్భాల్లో మహిళల మధ్య గొడవులు కూడా తలెత్తాయి. జత్తు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా మహిళలు సాఫీగా జర్నీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ మహిళలకు రూ. 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 29 లక్షల 67 వేల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో రోజుకు 6 లక్షల మంది ప్రయాణించినట్లు పేర్కొంది.

Advertisement

Next Story