మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

by GSrikanth |
మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మొత్తం 27 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రంతో పాటు వీరికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష నగదు పురస్కారం ప్రకటించింది. వీటిని మహిళా దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఉద్యోగులకు అందజేయనున్నారు.

స్పెషల్ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి పేరుతో సోమవారమే జీవో జారీ అయింది. ఈ మేరకు తదనుగుణంగా అవసరైన చర్యలు తీసుకోవాలని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం శాఖ కమిషనర్, భాషా మరియు సంస్కృతి డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఇప్పటికే మహిళా ఉద్యోగలందరికీ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story