- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి రెండు సార్లు టెట్ నిర్వహణ
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక నుంచి సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో మాత్రమే టెట్ నిర్వహణ జరిగేది. టీచర్ ఎలిజిబిలిటీ కోసం జరిగే ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో కూడా వెయిటేజీ ఉంటుంది. ఇక నుంచి జూన్, డిసెంబర్ నెలలో ఈ టెట్ పరిక్షను నిర్వహించనున్నారు. కాగా ఈ వార్త టెట్ అభ్యర్థులకు సంతోషాన్ని అందించింది. కాగా 2024 టెట్ పరీక్షలు మే 20వ తేదీన ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీ వరకు జరిగాయి. ఈ పరిక్షల ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 12న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు.. పేపర్-2లో 51,443 మంది అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13 శాతం.. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18 శాతంగా ఉన్నారు.