తెలంగాణలో మరో సంచలనం... హైడ్రాకు గ్రీన్‌సిగ్నల్

by srinivas |   ( Updated:2024-07-20 02:31:46.0  )
తెలంగాణలో మరో సంచలనం... హైడ్రాకు గ్రీన్‌సిగ్నల్
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం జీవో నంబర్ 99ని జారీ చేశారు. హైడ్రాను అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా రెండు విభాగాలు చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా 12 మంది సభ్యులతో హైడ్రా వర్నింగ్ బాడీ పని చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీ చైర్మన్‌గా 15 మందితో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ అథారిటీ(ఎస్డీఎంఏ), తెలంగాణ డి జాస్టర్ విభాగాలతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వింగ్‌ను సర్కారు అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏటా 3.2శాతం పట్టణ జనాభా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, టీజీఎస్పీడీసీఎల్, జలమండలి, ఎంఆర్‌డీసీఎల్, హైదరాబాద్ గ్రోడ్ కారిడార్ ఇతర సంస్థల నుంచి ఫీజులుగా వసూలు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోనున్నాయి.

సీఎం చైర్మన్‌గా హైడ్రా గవర్నింగ్ బాడీ

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గవర్నింగ్ బాడీకి సీఎం చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ మంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఈ గవర్నింగ్ బాడీలో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రత్యేక అవసరాలను బట్టి చీఫ్ సెక్రటరీ ఆహ్వానించే వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై సబ్ కమిటీ

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై హైడ్రాకు సబ్ కమిటీని సర్కారు నియమించింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 14 మంది సభ్యులుగా ఉంటారు. సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, వాటర్ బోర్డు ఎండీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, జీహెచ్ఎంసీ క మిషనర్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, తెలంగాణ కోర్ అర్బన్ రీజియ న్ పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల కలెక్టర్లు, రీజియన్‌లోని అన్ని పోలీసు కమిషనరేట్ల క మిషనర్లు, రీజియల్ పరిధిలోని స్థానిక సంస్థల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. సబ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్న ము న్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ ఆయా సందర్భాల్లో పలు అంశాల ప్రతిపాదికన నామినేట్ చేసే వ్యక్తులు సభ్యులుగా వ్యవహరిస్తారు.

Advertisement

Next Story