ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |
ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలోని వేసవిలో ప్రధాన కూడళ్ల వద్ద విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజు క్రితం వీటిని కొంత మంది సిబ్బందికి ప్రయోగాత్మకంగా అందజేసింది. వీటి పని తీరు పరిశీలించిన తర్వాత మిగతా సిబ్బందికి అందించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఏసీ హెల్మెట్ లోని బ్యాటరీని అరగంట ఛార్జింగ్ చేస్తే 3 గంటల పాటు పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త ఐడియా బాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story