- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News : పోలీసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసుల(Telangana Police)కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం పండగపూట గుడ్ న్యూస్ తెలిపింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల(Surrender Leaves) బడ్జెట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.182.48 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థికశాఖ పేర్కొంది. సర్కార్ బడ్జెట్ నిధులు విడుదల చేయడంపై పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పోలీసు ఉద్యోగాలకు సాధారణంగా సెలవులు ఉండవు. నెలలో 30 రోజులూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వీరికి ప్రత్యేక ప్రోత్సాహకలుగా సరెండర్ లీవ్స్ పేరుతో 15 రోజుల జీతాన్ని నగదు రూపంలో అందజేస్తారు. అయితే వీటిని ప్రతి ఏటా రెండుసార్లు జనవరి, జులైలో ఇవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిధులు విడుదల చేయడంతో పోలీసు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.