'మహిళ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వైఖరేంటి..?'

by Vinod kumar |
మహిళ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వైఖరేంటి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మహిళా రిజర్వేషన్‌పై ఆపార్టీ వైఖరి స్పష్టం చేసిన తరువాతే తెలంగాణలో సోనియా, రాహుల్ గాంధీ అడుగుపెట్టాలన్నారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి యావత్ దేశం మహిళా రిజర్వేషన్‌పై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ దక్కకూడదనే బీజేపీతో కలిసి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందన్నారు.

తెలంగాణ ప్రజలకు కావాల్సింది దొంగ డిక్లరేషన్లు కాదని మహిళ రిజర్వేషన్‌పై క్లారిటీ కావాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. అమలు కానీ సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీకి డిక్లరేషన్లు ఇవ్వడం మాత్రమే తెలుసునని వాటిని అమలు చేయడం మాత్రం తెలియదని మండిపడ్డారు. కర్ణాటకలో సైతం ఇచ్చి హామీలు విస్మరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

Advertisement

Next Story

Most Viewed