UPI Transactions: 52 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు

by S Gopi |
UPI Transactions: 52 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు సంఖ్యాపరంగా 52 శాతం పెరిగి 7,897 కోట్లకు చేరుకున్నాయని పేమెంట్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ వరల్డ్‌లైన్ తెలిపింది. ఈ లావాదేవీల విలువ రూ. 116.63 లక్షల కోట్లు కాగా, గతేడాది రూ. 83.16 లక్షల కోట్ల కంటే ఈ మొత్తం 40 శాతం వృద్ధి అని నివేదిక వెల్లడించింది. 2023, జనవరిలో మొత్తం 803 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది జూన్‌లో ఇది గణనీయంగా పెరిగి 1390 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. విలువ పరంగా కూడా గతేడాది జనవరిలో రూ. 12.98 లక్షల కోట్ల నుంచి ఈ జూన్ నాటికి రూ. 20.07 లక్షల కోట్లకు చేరింది. సంఖ్యా పరంగానే కాకుండా విలువలో కూడా ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే టాప్‌లో ఉంది. దీని తర్వాత గూగుల్‌పె, పేటీఎం ఉన్నాయి. యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ వాటి సగటు మాత్రం 8 శాతం క్షీణించింది. 2023, ప్రథమార్థంలో యూపీఐ లావాదేవీల సగంటు(యావరేజ్ టికెట్ సైజ్) రూ. 1,603 ఉండగా, 2024 ప్రథమార్థంలో ఇది రూ. 1,478కి తగ్గిందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed