- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Politics ‘కొంచెం మా ఆంధ్రవాళ్లకు కూడా చూపించండయ్యా..’ టీజీ అసెంబ్లీ వీడియోపై నెటిజన్లు

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యంలో (Democracy) ప్రజలకు ప్రభుత్వానికి మధ్య చట్టసభలు వారధిగా నిలుస్తాయి. అలాంటి చట్టసభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు ప్రజల భవిష్యత్ ను నిర్ణయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇరు పక్షాల మధ్య ప్రతీది రాజకీయమే అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సెషన్ (TG Assembly Session) సందర్భంగా శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యులు కలిసిపోవడం ఆసక్తిగా మారింది. పలువురు ప్రతిపక్ష పార్టీ సభ్యులు మంత్రుల వద్దకు వెళ్లి వారి సీట్లలో కూర్చిన ప్రజా సమస్యలపై విజ్ఞుప్తులు చేశారు. సరదాగా ముచ్చటించుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు వారితో ఏదో అంశంపై డిస్కషన్ చేస్తుంటే, మంత్రి పొంగులేటి వద్దకు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, గంగుల కమలాకర్, జూపల్లితో కొత్త ప్రభాకర్ రెడ్డి, తుమ్మలతో తలసాని, సీతక్కతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. సిద్ధాంతపరంగా ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ (BJP) శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ (CPI) ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒకే సీట్లో కూర్చుని ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ వీడియోలను చూస్తున్న నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ (Beauty of Democracy) అంటూ కితాబిస్తున్నారు.
బీఆర్ఎస్ వచ్చాకే..:
ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ 2014 కు ముందు ఇలా హెల్దీ పాలిటిక్స్ ఉండేవని ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం, పీఎం వద్దకు వెళ్లి కలిస్తే చాలు వారు పార్టీ మారుతున్నారను అని తప్పుడు ప్రచారం సృష్టించేవాళ్లు. ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే చివరకు క్యాడర్ కూడా ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకుని తమ లీడర్ ను వ్యతిరేకించే పరిస్థితుల వచ్చాయని కామెంట్ చేశారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ ఇలా ప్రతిపక్ష, అధికార పక్ష నేతలు సభలో కలిసి మాట్లాడుకోవడం చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ (Congress), రేవంత్ రెడ్డి హయాంలోనే చూస్తున్నామన్నారు. మరో వ్యక్తి స్పందిస్తూ ఈ వీడియోను కొంచెం మా ఆంధ్ర వాళ్లకు కూడా చూపించండిరా అయ్యా అంటూ కామెంట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిసారి రాజకీయాలే కాకుండా ఇలాంటి పరిణామాలు ప్రజలకు మేలు చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.