- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంబేద్కర్ విగ్రహానికి జాగా కరువు.. సమస్య పరిష్కరించని అధికారులు

దిశ, చేవెళ్ల : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కరువైంది. చేవెళ్ల మండలంలోని ఆలూర్ గ్రామంలోని దళిత యువజన సంఘం నాయకులు మహనీయులు అంబేద్కర్ మీద ప్రేమ తో విగ్రహని ఏర్పాటు చేసుకొని ఆయన ఆశయాసాధనల కొరకు పోరాటం చేద్దామని విగ్రహం కొనుగోలు చేసి తీసుకవచ్చారు.గత ముప్పై సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసి దానిని యువజన సంఘానికి కేటాయించింది.అక్కడే అ యువజన సంఘం సంవత్సరాలుగా మహనీయుల జయంతి వర్థంతుల కార్యక్రమాలు చేసి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసేవారు.
అంబేద్కర్ ఏర్పాటు చేసుకుందామని విగ్రహం తీసుక రాగానే స్థల సమస్య ఏర్పడింది. ఈ స్థలం మాకు కూడా ఉంది అని మరో వర్గం అన్నడంతో ఈ సమస్య అధికారులు దృష్టికి వెళ్ళింది. అధికారులు చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తొందరగా సమస్య పరిష్కరించాలని, గ్రామ పెద్దలు కూడా గతంలో సమస్య పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు వారి నుంచి ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థలం సమస్య పరిష్కరించాలి : దళిత యువజన సంఘం అధ్యక్షుడు గడ్డమీది బాబు
ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి ఈ సమస్యను కూడా తీసుకవేళము. ఆర్డీవోకు, తహసీల్దార్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్ సమస్య పరిష్కరించాలని సూచించిన వారు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కి రాసాము. మీరు కలెక్టర్ ఆఫీస్ లో సమస్య పరిష్కారం చేసుకోండి అని తాసీల్దార్ చెప్తున్నారు. స్థలానికి సంబంధించిన పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న అధికారులు పరిష్కరించలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తొందరగా సమస్య పరిష్కరించాలి. అంబేద్కర్ విగ్రహం తీసుకొచ్చే రోడ్డు మీద పెట్టి అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి జాగా కరువైంది.