ఐసీసీ అవార్డుకు శ్రేయస్ అయ్యర్ నామినేట్

by Harish |
ఐసీసీ అవార్డుకు శ్రేయస్ అయ్యర్ నామినేట్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. మార్చికి సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు‌కు నామినేట్ అయ్యాడు. అవార్డు నామినీలను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. గత నెలలో టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 5 మ్యాచ్‌ల్లో 243 రన్స్ చేశాడు. ఆ టోర్నీలో భారత్ తరపున అతనే టాప్ స్కోరర్. ఇక, మార్చి నెలలో అతను మూడు మ్యాచ్‌ల్లో 172 రన్స్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో సంచలన ప్రదర్శన నేపథ్యంలో అయ్యర్‌ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ప్రస్తుతం అయ్యర్ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను మూడు మ్యాచ్‌ల్లో 159 రన్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయ్యర్‌తోపాటు న్యూజిలాండ్‌ క్రికెటర్లు జాకఫ్ డఫీ, రచిన్ రవీంద్ర కూడా అవార్డుకు పోటీపడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే. మార్చిలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అతను 151 రన్స్ చేయడంతోపాటు 3 వికెట్లు తీశాడు. ఇక, కివీస్ పేసర్ డఫీ పాక్‌తో టీ20 సిరీస్‌లో 13 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.




Next Story

Most Viewed