Abhishek Singhvi: న్యాయ వ్యవస్థ ముందు అందరం సమానులే

by Gantepaka Srikanth |
Abhishek Singhvi: న్యాయ వ్యవస్థ ముందు అందరం సమానులే
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్వొకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలని రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందన్నారు. గురువారం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆయనకు బేగంపేట్‌లోని హరిత ప్లాజా హోటల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో న్యాయవాదులంతా అధికారం వైపే వెళ్తున్నారన్నారు. ఇది సరైన విధానం కాదన్నారు. న్యాయపరమైన అంశాలపై ఇండివిడ్యువల్‌గా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక లీగల్ హెడ్ కార్యక్రమాలు తరుచూ ఏర్పాటు చేయాలని కోరారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత కేసులు వేర్వేరు స్వభావాన్ని కలిగి ఉన్నాయన్నారు. విచారణ పూర్తయ్యకే కవిత అరెస్టు జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థ ముందు అందరం సమానులే అన్నారు.

టీ.పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. టీపీసీసీ లీగల్ సెల్‌కు పార్టీ అండగా ఉంటుందన్నారు. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్, ఇండ్ల స్థలాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. హైకోర్టు కొత్త భవనాన్ని సకాలంలో పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాలన సమన్యాయంతో జరుగుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు పవర్‌లో ఉంటుందన్నారు. పార్టీకి అన్ని వర్గాల మద్ధతు అవసరం అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టబడిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed