‘నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్ రతన్’.. స్వర్గంలో టాటాకు జంషెట్జీ వెల్‌కమ్!

by saikumar |   ( Updated:2024-10-10 18:51:42.0  )
‘నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్ రతన్’.. స్వర్గంలో టాటాకు జంషెట్జీ వెల్‌కమ్!
X

దిశ,నేషనల్ బ్యూరో : దేశం గర్వించదగ్గ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. పార్శీ అయిన టాటాకు ఆయన సంప్రదాయం ప్రకారం కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను మహా సర్కార్ పూర్తి చేసింది. అంతకుముందు ఆయన అంతిమయాత్ర సమయంలో వేలాది మంది టాటా అభిమానులు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు సైతం పాల్గొన్నారు.


ఇదిలాఉండగా, రతన్ టాటాకు సంబంధించిన ఓ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టాటా మరణాంతరం ఆయన ఆత్మ స్వర్గానికి చేరుకోగా.. అక్కడ రతన్ టాటాకు ఆయన ముత్తాతగారు జంషెట్జీ టాటా, భారతరత్న జేఆర్డీ టాటా స్వాగతం పలికినట్లు ఓ కార్టూన్‌ను రూపొందించారు. అందులో తన ముత్తాత జంషెట్జీ టాటా.. రతన్ టాటాను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ‘నన్ను గర్వపడేలా చేశావ్.. రతన్..’ అనేలా దృశ్యాన్ని గీశారు. పక్కనే ఉన్న జేఆర్డీ టాటా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు ఉండగా.. వారి పెంపుడు శునకాలు సైతం సంబ్రమాశ్చర్యంతో తమ యాజమానులను చూస్తున్నట్లు ఉన్న కార్టూన్ అభిమానుల మనసులను హత్తుకుంటోంది. కాగా, టాటా ఎంపైర్‌కు జంషెడ్జీ టాటా ఫౌండర్ కాగా.. దాన్ని జేఆర్డీ కొంత పుంతలు తొక్కించారు. ఆ తర్వాత రతన్ టాటా ఏకంగా ఖండాంతరాలకు టాటా గ్రూపును విస్తరించాడు.

Advertisement

Next Story