- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Meesho: ఉద్యోగులకు 9 రోజుల వేతనంతో కూడిన సెలవులు ప్రకటించిన మీషో
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో తన ఉద్యోగులకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయోజనాలను ప్రకటించింది. పండుగల సమయంలో సెలవులు ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, పై అధికారులు సెలవులను తిరస్కరించడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో మీషో ఉద్యోగులకు 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అవడానికి ఈ సెలవులను అందిస్తున్నాం. తొమ్మిది రోజుల వరకు ఈ-మెయిల్స్ రావు, ల్యాప్‌టాప్స్ ఉండవు, స్టాండప్ కాల్స్ అస్సలుండవు. ఆఫీసు నుంచి ఎలాంటి ఇబ్బంది కలిగించే కాల్స్ ఉండవు. ఈ సెలవులను అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఉంటుంది. పండుగ సీజన్ కోసం తమ ఉద్యోగులు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. వారికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరం. వచ్చే ఏడాదిని మరింత సామర్థ్యంతో పనిచేసేందుకు ఈ సెలవులు పనికొస్తాయని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.